బ్లాక్‌బస్టర్ స్టెప్పులు... విశాల్‌కి గాయాలు!
on Mar 11, 2019
అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలో ఐటమ్ సాంగ్ 'బ్లాక్‌బస్టర్... బ్లాక్‌బస్టరే' సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్. ఆ పాటలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్పులూ బ్లాక్‌బస్టరే. ఇప్పుడీ పాటకు విశాల్ స్టెప్పులు వేస్తున్నారు. వేసేటప్పుడు స్లిప్ అవ్వడంతో ఆయనకు గాయమైంది. ఇంతకీ, 'సరైనోడు'లో 'బ్లాక్‌బస్టర్' పాటకు విశాల్ ఎందుకు స్టెప్పులు వేస్తున్నాడంటే... తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హిట్ సినిమా 'టెంపర్'. ఈ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా 'అయోగ్య' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అందులో 'బ్లాక్ బస్టర్'ను ఉపయోగించుకుంటున్నారు. విశాల్ కూడా బ్లాక్ బస్టర్ స్టెప్పులు వేసే ప్రయత్నంలో డ్యాన్సింగ్ ఫ్లోర్ మీద స్లిప్ అయ్యి పడ్డారు. ఆయన కాలి మడమ దగ్గర గాయమైంది. అలాగే, మోచేయి వాచిందట. ఈ గాయాలు తగ్గిన తరవాత సాంగ్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయనున్నారు. తెలుగులో ఈ పాటకు అల్లు అర్జున్ పక్కన అంజలి స్టెప్పులు వేయగా... తమిళంలో విశాల్ పక్కన శ్రద్ధా దాస్ స్టెప్పులు వేస్తున్నారు.