అయ్యప్ప భక్తి చిత్రంలో అనుష్క!
on Mar 11, 2019

అయ్యప్ప భక్తి ప్రధాన చిత్రంలో అనుష్క నటించనున్నారు. ఆధ్యాత్మిక చిత్రాలు, ఫాంటసీ ఫిలిమ్స్ చేయడం అనుష్కకు కొత్తేమీ కాదు. 'ఓం నమో వేంకటేశాయ'లో కృష్ణమ్మ పాత్రలో నటించారు. ఫాంటసీ ఫిలిమ్స్ 'అరుంధతి', 'పంచాక్షరి' చేశారు. 'బాహుబలి' తరవాత 'భాగమతి' చేసిన అనుష్క... కొంత విరామం తరవాత కోన వెంకట్ నిర్మాణంలో 'సైలెన్స్' సినిమా అంగీకరించారు. తాజాగా అయ్యప్ప భక్తి ప్రధాన చిత్రంలో నటించేందుకు సూచనప్రాయంగా అంగీకరించారని తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాత శ్రీ గోకులం గోపాలన్ ధ్రువీకరించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మణిరత్నం సినిమాలు 'రోజా', 'దళపతి', 'విలన్', 'నవాబ్'తో ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్ పేరు తెచ్చుకున్నారు. మాతృభాష మలయాళంలో దర్శకుడిగా 'అశోక', 'ఉరిమి', 'నవరస' సినిమాలు తీశారు. అనుష్క ఓ కీలక పాత్రలో నటించనున్న అయ్యప్ప భక్తి చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. ఆగస్టు నెలాఖరున లేదా సెప్టెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



