వైరల్ అవుతున్న వీడియో: శ్రీదేవి కి వర్మ అసలు నివాళి
on Mar 3, 2018
.jpg)
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఎవరికీ అంతు చిక్కదు. అతని ట్వీట్స్ వెనుక మర్మం కనిపెట్టడం కష్టమయిన పనే. ప్రతి ఒక్కరిని తనదైన శైలిలో విమర్శించే వర్మ ఒకర్ని మాత్రం ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాడు. నటి శ్రీదేవిని అమితంగా అభిమానించే ఆర్జీవీ, ఆమె మరణం తర్వాత తన ప్రేమని ప్రతిభింభించేలా ట్వీట్లు పెడుతున్నాడు. ఇంత త్వరగా తీసుకెళ్ళినందుకు దేవుణ్ణి కూడా విమర్శించి, ప్రతి ఒక్కరికి అన్ హ్యాపీ హోలీ అంటూ విష్ చేసాడు. ఇక వర్మ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దేశం మొత్తం మొన్నటి వరకు టీవీ కి అతుక్కుని శ్రీదేవి అంతిమ యాత్ర కార్యక్రమాలు చూస్తుంటే, వర్మ మాత్రం తన ఇంట్లో హోమ్ థియేటర్ లో అభిమాన నటి సినిమాలు చూస్తూ కనిపించాడు. ఈ వీడియో లో వర్మ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తాను శ్రీదేవి డాన్స్ మరియు పర్ఫార్మెన్స్ ఎంతగా ఎంజాయ్ చేస్తాడో అర్ధమవుతుంది. అయితే, ఇప్పటికే కొన్ని బయోపిక్ లు తీసి మరికొన్ని తీసే ఆలోచనలో ఉన్న ఆర్జీవీ శ్రీదేవి బయోపిక్ కూడా చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



