ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేయనున్న బాలకృష్ణ
on Mar 3, 2018
.jpg)
నందమూరి బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలతో బిజీ గా ఉన్నాడు. ఇంకో ఒకటి రెండేళ్లలో కొడుకు మోక్షజ్ఞ ని హీరో గా ఇంట్రడ్యూస్ చేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో, తన డ్రీం ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసారు. ఆ మధ్య దర్శకుడు తేజ ట్రయల్ షూట్ కూడా చేయడం జరిగింది. అయితే, బాలయ్యకి తేజ పని తీరు అంతగా నచ్చలేదట. తాను అనుకున్న రేంజ్ లో అవుట్ ఫుట్ రాలేదని తేజ పై మండిపడ్డాడట. ఈ నెలలో షూటింగ్ మొదలు పెడదామని బాలకృష్ణ అనుకుంటే, తేజ మాత్రం వెంకటేష్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడట.
మార్చ్ 12 న మొదలవనున్న వెంకీ సినిమా పూర్తవ్వడానికి ఎంత కాదన్న 3 నెలల సమయం పడుతుందట. ఈ పరిస్థితులతో సహనం కోల్పోయిన బాలయ్య ఇక చివరికి తానే దర్శకత్వ బాధ్యతలు తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. అసలు బాలకృష్ణకి తన తండ్రి ఎన్టీఆర్ లాగా డైరెక్షన్ పైన మక్కువ ఎక్కువ. కానీ, పరిస్థితులు సహకరించక యాక్టింగ్ కే పరిమితమయ్యాడు. తేజ కనుక బాలయ్యని కుదుటపరచడంలో విఫలమయితే మాత్రం నందమూరి హీరోనే మెగా ఫోన్ పడతాడు అని వార్తలు వస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



