ఇదంతా ఎన్టీఆర్ ప్రమోషనల్ స్టంటేనా
on Mar 3, 2018

ఎన్టీఆర్, ఏయన్నార్ హయాంలో హీరోలు తీరిక లేకుండా కష్టపడితే, ఇప్పుడు మాత్రం సినిమా చేసే ముందు నుండే హడావిడి మొదలవుతుంది. క్యారెక్టర్ డిమాండ్ బట్టి అంటూ, సిక్స్ ప్యాక్ లు గట్రా చేస్తూ జిం లో గడిపేస్తున్నారు. అభిమానుల్ని అలరించడం, వేరియేషన్ చూపించడం కోసం కూడా స్టార్ హీరోలు కష్టపడాల్సి వస్తుంది. మొన్న అల్లు అర్జున్ నా పేరు సూర్య ఫస్ట్ లుక్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఇప్పుడు, ఎన్టీఆర్ కూడా తన ఫాన్స్ ని మెప్పించడం కోసం నానా కష్టాలు పడుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, తన తదుపరి చిత్రం కోసం గానూ తారక్ రోజుకి కొన్ని గంటలు శ్రమిస్తున్నాడు. సోషల్ మీడియా లో లీకయిన కొన్ని ఫొటోల్లో జూనియర్ సన్నగా కనబడుతున్నాడు. అయితే, ఇక నుండి జరిగే ఫిట్నెస్ ప్రోగ్రాం ద్వారా బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నాడు. హాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ ఎక్సర్ సైజు లు చేస్తున్న వీడియో ట్విట్టర్ లో పెట్టాడు. ఇక నుండి అసలు కథ మొదలవనుంది అని ఎన్టీఆర్ ని రానున్న రోజుల్లో ఇంకా కష్టపెట్టనున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇంకో మూడు వారాల పాటు ఈ ఫిట్నెస్ ప్రోగ్రాం జరగనుంది. ఇంతకుముందెన్నడూ చూడని గెటప్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడని సమాచారం. అయితే, ఇంతలో పిక్స్, డైట్, ఫిట్నెస్ ప్లాన్ నెట్లో లీకవ్వడం ప్రమోషనల్ స్టంట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



