'...లవర్' కోసం 'ఫైటర్' విజయ్ దేవరకొండ వచ్చాడు
on Feb 1, 2020
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. శుక్రవారంతో ముంబై షెడ్యూల్ పూర్తయింది. జనవరి నెలాఖరున ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అదీ ముంబైలోనే. కొట్టిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. హీరోతో పాటు కొందరు కీలక పాత్రలపై అక్కడ సన్నివేశాలు తెరకెక్కించారు. పది రోజుల షెడ్యూల్ పూర్తి కావడంతో పూరి, ఛార్మితో కలిసి హీరోగారు హైదరాబాద్ వచ్చారు.
'ఫైటర్' షెడ్యూల్ పూర్తి చేసుకున్న వెంటనే విజయ్ దేవరకొండ హైదరాబాద్ రావడానికి కారణం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రమిది. ఆల్రెడీ పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిర్మాతతో పాటు హీరోయిన్లలో ఒకరైన ఐశ్వర్య రాజేష్ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన ప్రతి సినిమాకు పబ్లిసిటీ తో ప్రత్యేకంగా దృష్టి సారించే విజయ్ దేవరకొండ... 'వరల్డ్ ఫేమస్ లవర్' కోసం హైదరాబాద్ లో వాలిపోయాడు.