చచ్చిపోతానంటూ పోస్ట్ పెట్టిన మాధవీలత... అంతలోనే?
on Feb 1, 2020
టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు తీవ్ర కలకలం రేపింది. ఏదో ఒకరోజు ‘ప్రేమ' సినిమాలో రేవతిలా చచ్చిపోతానంటూ పోస్టు పెట్టింది. తాను త్వరలో చచ్చిపోతాననే విషయాన్ని ఎప్పుడూ తన ఫ్రెండ్స్‌కు చెబుతుంటానంటూ తెలిపింది. ‘ప్రేమ' సినిమాలో ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటూ రేవతి బతుకుతూ ఉంటుందని... చివరికి ఏ మందూ పనిచేయక చనిపోతుందన్న మాధవీలత... తాను కూడా అలాగే త్వరలో చనిపోతానంటూ సినీ స్టైల్లో చెప్పుకొచ్చింది. ఎప్పుడో కాదు... ఈ గురువారం అర్ధరాత్రే తాను మరణిస్తానంటూ తెలిపింది.
అయితే, మాధవీలత పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. మాధవీలత అభిమానులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. అసలేమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే... అలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ సూచించారు. మీకేమీ కాదని... ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, తనకున్నది చిన్న సమస్యలే అయినప్పటికీ, వాటికి ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉందంటూ మాధవీలత తెలిపింది. మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి... తనను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాయని చెప్పుకొచ్చింది. తనకు మందులంటే పరమ అసహ్యమని... కానీ ఆ బాధ నుంచి ఉపశమనం పొందడానికే మెడిసిన్స్ వాడుతున్నానని తెలిపింది. తనకు కూడా కలలు... కోరికలు... ఆశలు ఉన్నాయని... కానీ, ఏదో ఒకరోజు ‘ప్రేమ' సినిమాలో రేవతిలా మందులు పనిచేయక చనిపోతానేమోనంటూ మాధవీలత విచారణ ఆవేదన వ్యక్తంచేసింది. కచ్చితంగా ఈ మందులు తన ఆయుష్షును పెంచవేమేనంటూ భయాన్ని వ్యక్తంచేసింది. ఆరోగ్యమే అసలైన సంపద అంటారు... కానీ, ఇది నా విషయంలో నిజం కాదేమోనంటూ మాధవీలత తాను పడుతున్న బాధను నెటిజన్లతో పంచుకుంది.
అయితే, చచ్చిపోతానంటూ పెట్టిన పోస్టు వైరల్ కావడంతోపాటు మీడియాలో కథనాలు రావడంతో మాధవీలత వివరణ ఇచ్చింది. మందులపై విరక్తితోనే తాను ఆ పోస్ట్ పెట్టానని, తానిప్పుడు బాగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే, మైగ్రేన్‌తో తీవ్రంగా బాధపడుతున్నానని మరోసారి తెలిపింది.
Also Read