మహేష్‌తో సినిమా... నేనూ వెయిటింగ్! రాశీ ఖన్నా ట్విట్టర్ ముచ్చట్లు
on May 4, 2020

తాను ప్రేమ వివాహమే చేసుకోవచ్చని అగ్ర కథానాయిక రాశీ ఖన్నా తెలిపారు. ‘మనం’లో అతిథి పాత్ర చేశాక... ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన రాశీ, తర్వాత కాలంలో ఎన్టీఆర్, రవితేజ, నితిన్, నాగచైతన్య అక్కినేని, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, విజయ్ దేవరకొండ తదితర స్టార్ హీరోల సరసన చిత్రాలు చేశారు. తెలుగులో ఆమె చేసిన లాస్ట్ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసారు. ఆదివారం సాయంత్రం ట్విట్టర్‌లో ప్రేక్షకులు, అభిమానులతో రాశీ ఖన్నా ముచ్చటించారు. ఆ విషయాలివీ...
లాక్‌డౌన్‌లో మోటివేషన్ కోసం ఏం చేస్తున్నారు?
నేను వీలైనంతవరకూ పాజిటివ్‌గానే ఉంటాను. మోటివేషనల్ వీడియోస్ చూస్తా. పుస్తకాలు చదువుతా. అవి నా మైండ్‌ని హెల్దీగా ఉంచుతాయి.
లాక్‌డౌన్‌లో ఏ గేమ్ ఆడుతున్నారు? లూడో లేదా పబ్జీ...
లూడో.
మీ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్?
ప్రాగ్.
తెలుగులో మీకిష్టమైన హీరోయిన్?
సమంత.
తమిళంలో ఫేవరెట్ హీరో?
తళపతి విజయ్ సార్.
తమిళంలో ఇష్టమైన దర్శకుడు?
తమిళ ఇండస్ట్రీలో అమేజింగ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. వెట్రిమారన్, శంకర్, మణిరత్నం, అట్లీ అంటే ఇష్టం.
మీరు థియేటర్‌లో చూసిన తొలి సినిమా?
‘టైటానిక్’ (సిగ్గు పడుతున్న ఎమోజీ, నవ్వుతున్న ఎమోజీ పోస్ట్ చేశారు)
మీ ఫేవరెట్ టీవీ షో?
డార్క్.
ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ?
ది ప్రపోజల్
ఫేవరెట్ సాంగ్?
ఇప్పుడు అయితే ‘గెట్ యు ది మూన్’ (ఫీట్ స్నో) – కిన
ఫేవరెట్ బుక్?
ఇప్పుడు అయితే డాక్టర్ వేన్ డయర్ రాసిన ‘ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్’.
మహేష్‌తో ఎప్పుడు యాక్ట్ చేస్తారు? చూడాలని వెయిటింగ్?
నేనూ వెయిట్ చేస్తున్నా. త్వరలో ఉంటుందని ఆశిస్తున్నా.
అల్లు అర్జున్ గురించి?
ప్రతి ఒక్కరినీ చాలా ఎంకరేజ్ చేస్తారు. అల్లు అర్జున్ నటన, సినిమాలను ఇష్టపడతా. ఆయనతో నటించాలని చూస్తున్నా.
మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్?
తమిళంలో సూర్య హీరోగా హరి దర్శకత్వం వహిస్తున్న సినిమా, ‘ఆరణ్మనై 3’ చేస్తున్నా. తెలుగులో డిస్కషన్స్‌లో ఉన్న రెండు సినిమాల గురించి త్వరలో క్లారిటీ ఇస్తా. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత!
ఆరేంజ్డ్ మ్యారేజ్ లేదా లవ్ మ్యారేజ్?
లవ్ మ్యారేజ్ అనుకుంటున్నా.
మీ తెలుగు అభిమానుల గురించి?
నా ప్రాణం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



