ప్రముఖ నటుడు సముద్రఖని కోసం వేణు స్వామి పూజలు.. తెరపైకి మరో వివాదం!
on Jul 17, 2024
పూజలు, జాతకాలు కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి (Venu Swamy). ఆయన చెప్పిన జాతకాలు తప్పయినా, ఆయన మీద విమర్శలు వచ్చినా.. కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం వేణు స్వామితో పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎందరో హీరోయిన్లు, యాంకర్లు వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని చేరిపోయారు.
కామాఖ్య దేవాలయంలో వేణు స్వామి చేత సముద్రఖని ప్రత్యేక పూజ చేయించుకున్నారు. ఈ విషయాన్ని వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "కామాఖ్య దేవాలయంలో ఈరోజు స్పెషల్ పూజ అనంతరం మహా ప్రసాదంలో భాగంగా చేపల కూర మరియు మటన్ కూరను ప్రసాదంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజు కామాఖ్య దేవాలయంలో దర్శకులు, నటులు సముద్రఖని గారి పూజ కూడా చాలా వైభవంగా జరిగింది" అని వేణు స్వామి రాసుకొచ్చారు.
చేపల కూర, మటన్ కూరను ప్రసాదమని చెప్పడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాను చేసే పూజల్లో మాంసం, మద్యం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో వేణు స్వామి చెప్పారు.
Also Read