25 వేల రూపాయల చెక్‌తో ‘దేవర’ నటుడి ఎమోషనల్ వీడియో.. అసలేమైంది?!
on Jul 17, 2024
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర’ చిత్రం నుంచి ఇటీవల బయటికి వచ్చిన ఓ పవర్‌ఫుల్ డైలాగ్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’ అనే పవర్‌ఫుల్ డైలాగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన ఓ నటుడు తన క్యారెక్టర్‌కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాడు. దానికి రావాల్సిన రెమ్యునరేషన్ కూడా తనకు అందిందని, దానికి సంబంధించిన చెక్‌ను చూపిస్తూ ఓ ఎమోషనల్ వీడియో చేశాడు.
‘తమ్ముళ్లు.. దేవర డబ్బింగ్ పూర్తి చేశా. పెండిరగ్ అమౌంట్ కూడా వచ్చేసింది. యువ సుధ ఆర్ట్స్ క్లియర్ చేసేసింది’ అంటూ చెక్ చూపిస్తూ ఆనందంగా కేరింతలు కొట్టాడు. అంతేకాదు. తను పీజీలో ఉంటున్నానని, ఆ ప్లేస్ తనకు బాగా అచ్చొచ్చిందని చెబుతున్నాడు. అందులో ఉండగానే వాల్తేరు వీరయ్య, మంగళవారం, దేవర చిత్రాల్లో నటించానని, ఇప్పుడు మరో రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నానని చెప్తున్నాడు. అందుకే ఆ స్థలం నుంచి వెళ్ళేది లేదు అంటున్నాడు. అయితే ఓ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళానని, ఆ సమయంలో పీజీ ఓనర్ ఫోన్ చేసి రెంట్ కట్టకపోతే సామాన్లు బయట పెట్టుకోవాలని చెప్పాడట. అందుకే తనో నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నాడా నటుడు. తనలా పీజీలో ఇబ్బందులు పడుతున్నవారి కోసం కనీసం ఓ పది పీజీల స్థాపించాలన్న కోరిక ఉందని, అది ఎంతవరకు జరుగుతుందో చూడాలంటూ ఎమోషనల్ అయ్యాడు.
సెప్టెంబర్ 27న ‘దేవర’ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా ఇది.
Also Read