సినిమాపై మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పోలీసు కేసు..రామ్, పూరి ఏ నిర్ణయం తీసుకుంటారు
on Jul 17, 2024
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram potineni)పూరి జగన్నాధ్(puri jagannadh)కాంబోలో 2019 లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్(ismart shankar)విడుదలైన అన్ని చోట్ల ఘన విజయం సాధించడంతో పాటు రామ్ అండ్ పూరి కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో డబుల్ ఇస్మార్ట్ (dabul ismart) చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉత్సాహం కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
అగస్ట్ పదిహేను న డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నేపధ్యంలో మూవీ నుంచి ఒక్కో సాంగ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మార్ ముంత చోడ్ చింత(maar muntha chod chintha)అనే పక్కా మాస్ లిరిక్స్ తో ల్యాండ్ అయ్యింది. ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడ కూడా స్పీడ్ తగ్గకుండా రేపు థియేటర్స్ లో అందరి చేత డాన్స్ చేయించే విధంగా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ పై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి(brs)పోలీసు కేసు నమోదు చేసింది. అదేంటి పాటకి వాళ్ళకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా! ఈ మార్ ముంత చోడ్ చింత లో ఒకప్పుడు కేసిఆర్(kcr)నోటి వెంట వచ్చిన.. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అనే ఫేమస్ డైలాగ్ ని హుక్ లైన్ గా వాడారు. సింఫుల్ గా చెప్పాలంటే మహేష్ బాబు గుంటూరు కారం లోని ఆ కుర్చీ మడతపెట్టి అనే టైప్ లో. పైగా కేసిఆరే చెప్పినట్టుగా ఆయన నోటి వెంట నుంచి ఎలా వచ్చిందో యాజ్ టిజ్ గా అలాగే వాడారు. దీంతో హైదరాబాద్ నగరంలోని ఎల్ బి నగర్ పిఎస్ లో పూరి పై చర్యలు తీసుకోవాలంటు కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతు ఒక ఐటెం సాంగ్ లో కేసిఆర్ మాటని వాడుకోవడాన్ని మేము ఆక్షేపించం. తెలంగాణ భాష, యాస లని కించ పరిచినా, మా నాయకుడు ని కించ పరిచినా ఊరుకునే ప్రసక్తి లేదు.వెంటనే ఆ మాటని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి పూరి అండ్ టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక ఆ సాంగ్ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ(manisharma)స్వర కల్పన చెయ్యగా అల వైకుంఠ పురం లోని రాములో రాములా ఫేమ్ కాసర్ల శ్యామ్(kasarla syam)లిరిక్స్ ని సమకూర్చాడు రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, కీర్తన శర్మ లు అత్యద్భుతంగా ఆలపించారు.
Also Read