మారుతి వెంకీ..ఈ సారి ఫిక్స్..!!
on Oct 1, 2015
భలే భలే మగాడివోయ్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మార్చేసింది. మారుతి తరువాతి సినిమా ఎవరితో చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ మారింది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. వెంకీ మారుతి కాంబినేషన్ అనగానే ఓ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావాల్సిందే. అప్పట్లో వెంకటేష్ హీరోగా మారుతి 'రాధ' అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు సాగాయి. కానీ ఆ కథ నాది అంటూ వేరొక రచయిత అడ్డు చెప్పాడు. రచయితల సంఘంలో పంచాయితీ జరిగింది. దాంతో ప్రాజెక్టు వదులుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వేరొక కథని రెడీ చేసుకుని వెంకీని కలిశాడు. ఈసారి కూడా కథ ఓకే అయ్యింది. త్వరలోనే కొత్త సినిమా సెట్స్ కి వెళ్లనుంది.