పులికి ఫ్లాప్ టాక్..అయితే ఏంటీ?
on Oct 2, 2015
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'పులి' మీద భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. అయితే రిలీజ్ కి ముందే విజయ్ ఇంటిపై ఇంకమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేయడంతో ఆయన అభిమానులు ఒక్కరిసారిగా షాక్ కి గురయ్యారు. అలాగే ఈ సినిమా రిలీజ్ కి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల సినిమా ఒక షో లేట్ గా రిలీజయ్యింది... కొన్ని చోట్ల ఆగిపోయింది. రిలీజ్ అయిన ఏరియాల్లో ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిన కూడా ఓపెనింగ్స్ మాత్రం భారీగానే వచ్చాయట. ఫ్లాప్ టాక్ వల్ల సినిమాకి వచ్చే నష్టం ఏమిలేదని నిర్మాతలు అంటున్నారు.
ఎందుకంటే అందరూ అనుకుంటునట్టూ ఈ సినిమా మరీ భారీ బడ్జెట్ తో నిర్మించలేదట. మొత్తం కలిపి ఓ 75కోట్ల మధ్యలో ఫినిష్ చేశారట. ఈ సినిమాలో భారీ యుద్ద సన్నివేశాలు కూడా లేకపోవడం ఖర్చు చాలా తక్కువే అయ్యిందట. అయితే ఈ సినిమా బిజినెస్ మాత్రం భారీగానే అయ్యిందట. అన్ని బాషల్లో థియేటరికల్ రైట్స్ తోనే సినిమాకి 85కోట్ల దాకా వచ్చిందట.అయితే ఫస్ట్ డే 32కోట్ల దాకా వసూళ్ళు చేయడంతో వీకెండ్ అయ్యేసరికి సినిమా మరీ నష్టాలు లేకుండా బయటపడే ఛాన్స్లు లు ఎక్కువగా వున్నాయట. దీంతో నిర్మాతలు హ్యాపీగా వున్నారట. మొత్తానికి పులికి ఫ్లాప్ టాక్ వచ్చిన భయపడనక్కరలేదట!!