పూరి పార్టీలో... మస్త్ మజా!
on Oct 1, 2015
విలాసపురుషుడు పూరి జగన్నాథ్. హైదరాబాద్‌లోని పూరి ఆఫీసులో అడుగుపెడితే చాలు... ఆయనెంత ఖరీదైన జీవితం గడుపుతున్నాడో అర్థం అవుతుంది. జీవితాన్ని అనుభవించడంలో గురువు రాంగోపాల్ వర్మ లక్షణాల్ని, అలవాట్లని పూర్తిగా పుణికి పుచ్చుకొన్నాడు పూరి. ఇటీవల జరిగిన పూరి పుట్టిన రోజు వేడుక ఇందుకు నిదర్శనం.
బర్త్ డే పార్టీ అంటే.. కేక్ కట్ చేయడం, లేదంటే మందు పార్టీ చేసుకోవడం మామూలే. పూరి కూడా ఇలానే పార్టీ చేసుకొంటే కొత్తే ముంది. అందుకే మందు, విందుతో పాటు చిందుని పురమాయించాడు. కొంతమంది బెల్లీ డాన్సర్లను తీసుకొచ్చి... వాళ్లు ఆడుతూ ఉంటే... ఆస్వాదించాడు. టాలీవుడ్‌కి చెందిన కొందరు కథానాయికలు కూడా పూరి పార్టీలో డాన్స్ చేస్తూ ఉల్లాసంగా గడిపారని టాక్. ఈ పార్టీకి చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.
పూరి పార్టీలో బెల్లీ డాన్సుల హంగామా, వీటి మధ్య మందు కొడుతూ, పొగ పీలుస్తూ.. ఆస్వాదిస్తున్న రాంగోపాల్ వర్మ వీడియో ఒకటి.... చర్చనీయాంశమైంది. ఈ పార్టీకోసం పూరి దాదాపుగా రూ.50 లక్షల వరకూ ఖర్చు పెట్టాడని టాక్. టాలీవుడ్‌లో పూరికి ఆప్త మిత్రులు, కొంతమంది హీరోయిన్లు, వర్మ శిష్యులూ ఈ పార్టీలో పాల్గొన్నారని, తెల్లవార్లూ ఎంజాయ్ చేశారని టాక్.