ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.. సంక్రాంతి రేస్ నుంచి 'రాధేశ్యామ్' ఔట్
on Jan 5, 2022

ఊహించిందే జరిగింది. సంక్రాంతి రేస్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కూడా తప్పుకుంది. దీంతో ఈ 'సంక్రాంతి'ని 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలతో 'సినిమా పండగ'లా చేసుకుందామనుకున్న సినీ ప్రేమికులకు నిరాశే మిగిలింది.
సెకండ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ కావడం, పలు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించడంతో మళ్ళీ సినీ పరిశ్రమకి మంచి రోజులు వచ్చాయని భావించారంతా. కానీ ఒమిక్రాన్ ఎంటర్ అవ్వడంతో కొద్దిరోజులుగా పరిస్థితి మారిపోయింది. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో పలు రాష్ట్రాలలో థియేటర్స్ తాత్కాలికంగా మూత పడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి. ఈ ప్రభావం పాన్ ఇండియా మూవీలపై ఎక్కువగా పడుతుంది. ఇప్పటికే జనవరి 7 న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా, జనవరి 14 న విడుదల కావాల్సిన రాధేశ్యామ్ కూడా తాజాగా వాయిదా పడింది.

'ఆర్ఆర్ఆర్' వాయిదా ప్రకటన వచ్చిన సమయంలోనే రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మూవీ టీమ్ మాత్రం జనవరి 14 నే విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే రోజురోజుకి పరిస్థితి చేయి దాటి పోతుండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో రాధేశ్యామ్ ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న కారణంగా మూవీ విడుదలని వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు చక్కబడ్డాక వీలైనంత త్వరలో థియేటర్స్ లో కలుద్దామని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



