మే 23న థియేటర్లకు 'వైభవం'
on May 11, 2025

నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న 'వైభవం' చిత్రం మే 23, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయం కానున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేయబడిన ఎంతో మంది ప్రతిభావంతులైన నటులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ కు సెన్సార్ బోర్డ్ నుండి ఇటీవల కాలంలో అరుదైపోయిన క్లీన్ U సర్టిఫికెట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షలుల నుండి విశేష స్పందన లభించిందని మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి సినిమాలని ఆదరిచడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారన్న సంగతి మరోసారి ఈ చిత్రంతో నిరూపితమవుతుందని దర్శకుడు సాత్విక్ తెలిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



