హీరో రామ్ ఎవరి తాలూకానో తెలుసా..?
on May 11, 2025

హీరో రామ్ పోతినేని తన 22వ సినిమాని 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, 'RAPO 22' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. (Ram Pothineni)
రామ్ పుట్టినరోజు సందర్భంగా మే 15న టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది. 'RAPO 22'కి 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మేకర్స్ అదే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు వినికిడి.
ఈ సినిమాలో రామ్ ఒక స్టార్ హీరో అభిమానిగా కనిపించనున్నాడట. ఆ హీరో రోల్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర మెరవనున్నాడని సమాచారం. హీరోలకు ట్యాగ్స్ ఉంటాయి కదా. అలా ఇందులో ఉపేంద్రకు 'ఆంధ్రా కింగ్' ట్యాగ్ ఉంటుందట. ఇక ఆయన అభిమానిగా రామ్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' అని చెప్పుకుంటాడని తెలుస్తోంది.
మరోవైపు, ఈ టైటిల్ విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకు రావడం సహజం. పవన్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 'డిప్యూటీ సీఎం తాలూకా' అనే మాట మారుమోగిపోయింది. క్యాచీగా ఉండటంతో పాటు, త్వరగా జనాల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో.. రామ్ సినిమాకి 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే టైటిల్ పెట్టి ఉంటారనే అభిప్రాయం కలుగుతోంది.
ఇటీవల వరుస మాస్ సినిమాలు చేసి పరాజయాలు ఎదుర్కొన్న రామ్.. కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



