విశ్వక్ సేన్ గ్లోబల్ ఫిల్మ్.. కల్ట్ చూపిస్తాడా..?
on May 11, 2025

పాన్ ఇండియా ట్రెండ్ అయిపోయింది. పాన్ వరల్డ్ ట్రెండ్ మొదలైంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ లో పలు సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో విశ్వక్ సేన్ మూవీ కూడా చేరింది.
విశ్వక్ సేన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ దర్శకత్వంలో గతంలో 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తన డైరెక్షన్ లో మూడో సినిమాగా 'కల్ట్'ని ప్రకటించాడు. విశ్వక్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో 40 మంది నూతన నటీనటులు పరిచయం కాబోతున్నారు.
తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్స్ పై కరాటే రాజు, సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ మూవీ గ్లోబల్ ఫిల్మ్ గా రూపొందనుంది. తెలుగు, హిందీతో పాటు జాపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. విశ్వక్ హీరోగా నటించిన గత మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. మరి తాను దర్శకత్వం వహిస్తున్న గ్లోబల్ ఫిల్మ్ 'కల్ట్'తో ఏ స్థాయిలో సత్తా చాటుతాడో చూడాలి.
'కల్ట్' సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ఘనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే మొదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ విభిన్నంగా, ఆకట్టుకునేలా ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



