'మహర్షి'లో 'దూకుడు' పోరి
on Mar 18, 2019

మీనాక్షీ దీక్షిత్‌కి మహేష్ బాబు మరో ఛాన్స్ ఇచ్చాడు. 'మహర్షి'లో ఆమెకు ఒక మంచి పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఇంతకీ, ఎవరీ మీనాక్షీ దీక్షిత్ అనుకుంటున్నారా? 'దూకుడు' సినిమా చూశారు కదా! మాగ్జిమమ్ ప్రేక్షకులు చూసే ఉంటారు.. అందులో హీరో ఇంట్రడక్షన్ సాంగులో ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంటుంది చూడండి... ఆమె మీనాక్షీ దీక్షిత్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాలో ఐటమ్ సాంగులోనూ సందడి చేసింది. తరవాత శ్రీకాంత్ 'దేవరాయ', 'అడివి కాచిన వెన్నెల' సినిమాల్లో నటించింది. నిజంగా, ఆ సినిమాల్లో ఆమె అందం అడివి కాచిన వెన్నెలే అయ్యింది. పేరు, గుర్తింపు రాలేదు. తరవాత తమిళ్, హిందీ సినిమాలు చేసింది. చాలా రోజుల తరవాత తెలుగులో మీనాక్షికి ఒక అవకాశం వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మహర్షి'లో మహేష్ బాబు గాళ్ ఫ్రెండ్ గా కనిపించనుంది మీనాక్షీ దీక్షిత్. అమెరికాలో మహేష్ కనిపించే సన్నివేశాల్లో మీనాక్షి దీక్షిత్ కూడా కనిపిస్తుందట. ఇండియా వచ్చిన తరవాత పూజా హెగ్డేతో ప్రేమకథ మొదలవుతుందట. రైతు సమస్యలు, స్నేహం వంటి అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



