బన్నీ- త్రివిక్రమ్ నాన్నను వదలరా!!
on Mar 16, 2019

బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. `సన్నాఫ్ సత్యమూర్తి`లో తండ్రి అకాల మరణంతో తండ్రి బాధ్యతలన్నీ తనయుడు భుజాలపై వేసుకుని చివరకు తండ్రి పేరు ఎలా నిలబెట్టాడు అన్నది సినిమా. అయితే ప్రజంట్ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా కూడా తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో ఉంటుందట. దీంతో ఈ సినిమాకు `నాన్న -నేను` అనే టైటిల్ నిర్ణయించాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఇందులో తండ్రి పాత్రలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీని తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అల్లు అర్జు న్ సరసన పూజా హెగ్డే, కేథరిన్ హీరోయన్స్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే రామ్ చరణ్ బర్త్ డే రోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఇక నాన్న నేను అనే టైటిల్ పెడుతానున్నారని తెలిసిన నాటి నుంచి అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకులు నాన్నను త్రివిక్రమ్ వదలడా అంటూ చెప్పుకొస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



