బామ్మర్ది కోసం ఎన్టీఆర్.. రేపు రచ్చ రచ్చే!
on Apr 3, 2025
2023 లో వచ్చిన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన మూవీ 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square). నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. మార్చి 28న థియేటర్లలో అడుగుపెట్టి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మ్యాడ్ స్క్వేర్.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
'మ్యాడ్ స్క్వేర్'లో హీరోగా నటించిన నార్నె నితిన్.. ఎన్టీఆర్ కి బావమరిది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తోనూ ఆయనకు మంచి అనుబంధముంది. మ్యాడ్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లాంచ్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే జరిగింది. అంతేకాదు, సితార బ్యానర్ లో రూపొందిన మరో సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ కి కూడా ఆయన గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక ఇప్పుడు మ్యాడ్ 2 సక్సెస్ మీట్ కి రాబోతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో శుక్రవారం(ఏప్రిల్ 4) సాయంత్రం 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావడానికి ఎన్టీఆర్ అంగీకరించాడని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని అంటున్నారు.
'మ్యాడ్ స్క్వేర్'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
