రిషి కపూర్‌కి టాలీవుడ్ నివాళి
on Apr 30, 2020

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మరణంపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారని విచారం వ్యక్తం చేశారు. అతడికి ఘనంగా నివాళులు అర్పించారు.
"రిషి జీ ఇక లేరు అని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఆయన గొప్ప స్నేహితుడు. గొప్ప కళాకారుడు కూడా. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న వ్యక్తి. గొప్ప వారసత్వాన్ని కొనసాగించిన నటుడు. జరిగిన నష్టానికి నా హృదయం అవుతుంది" - మెగాస్టార్ చిరంజీవి
"భారతీయ చిత్ర పరిశ్రమకు భారీ నష్టం ఇది. లెజెండరీ యాక్టర్స్ ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ అకాల మరణం తీవ్రంగా బాధించింది. వాళ్లు ఎప్పటికీ గుర్తు ఉంటారు. వాళ్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" - నటసింహం నందమూరి బాలకృష్ణ
"చాలా విషాదకరమైన రోజులివి. రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప ప్రతిభావంతులను కోల్పోవడం నిజంగా బాధగా ఉంది. అందరికీ ఆనందాన్ని పంచే చిన్నపిల్లాడి వంటి నవ్వుతో రిషికపూర్ ఎప్పటికీ మన హృదయాలలో నిలిచి ఉంటారు. ఆయనను కలిసిన ప్రతిసారీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఆయన లేకపోవడం మా కుటుంబానికి కూడా పెద్ద నష్టమే. ఇటువంటి పరీక్షా సమయంలో కపూర్ కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" - విక్టరీ వెంకటేష్
"రిషి కపూర్ సార్ గురించి వినగానే నా హృదయమంతా విచారంతో నిండింది. సినిమా ప్రపంచానికి మరో కోలుకోలేని నష్టం వాటిల్లింది. ఆయన కంప్లీట్ ఎంటర్టైనర్... అద్భుతమైన ప్రతిభ గల నటుడు. నిజమైన లెజెండ్. రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నా" - సూపర్ స్టార్ మహేష్ బాబు
"నిన్న అత్యంత ప్రతిభావంతులైన ఇర్ఫాన్ ఖాన్ ని కోల్పోయాం. ఈరోజు లెజెండరీ రిషి కపూర్ సార్. భారతీయ సినిమాకు ఇది ఘోరమైన నష్టం" - యంగ్ టైగర్ ఎన్టీఆర్
"రిషి కపూర్ జీ ఇక లేరు అని తెలుసుకోవడం హృదయ విదారకం. భారతీయ సినిమాలో మరో గొప్ప వ్యక్తి ఈరోజు మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు. కపూర్ ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
"చాలా బాధగా ఉంది. 24 గంటల వ్యవధిలో గొప్ప నటులైన ఇర్ఫాన్ ఖాన్ సార్, రిషి కపూర్ సాబ్ ని కోల్పోవడం షాకింగ్ గారి ఉంది. సినిమా పరిశ్రమకు తీరని నష్టం ఇది. వాళ్ల నటించిన క్లాసిక్ సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తు ఉంటారు. శాశ్వతంగా జీవిస్తారు" - నందమూరి కళ్యాణ్ రామ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



