కరోనా కాలంలో గొప్ప నటుడికి ఎంత దుస్థితి!?
on Apr 30, 2020

కరోనా కాలంలో దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కి ఎంత దుస్థితి వచ్చిందని బాలీవుడ్ దర్శకుడు తిగ్మన్షు ధూలియా కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డి)లో ఇర్ఫాన్‌కి ఆయన జూనియర్. వారిద్దరి మధ్య అప్పటినుండి పరిచయం ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. బుధవారం ఇర్ఫాన్ ఖాన్ మరణించాడనే వార్త తెలియగానే హుటాహుటిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పటల్‌కి తిగ్మన్షు వెళ్లారు. తర్వాత అంత్యక్రియలు జరిగిన కబరిస్థాన్ కి వెళ్లారు. ఇర్ఫాన్‌తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అంత్యక్రియలు నిరాడంబరంగా జరగడం పట్ల బాధను వ్యక్తం చేశారు.
"కరోనా సమయంలో ఎంతో గొప్ప నటుడికి ఈ విధంగా జరిగింది. ఇర్ఫాన్ అంత్యక్రియలు చిన్నగా జరగడం నాకు ఎంతో బాధగా ఉంది. కరోనా లేకపోతే భారీ జనసందోహం మధ్య అతడికి ఘన నివాళి లభించేది. అంతిమ వీడ్కోల యాత్ర ఎంతో ఘనంగా ఉండేది. ముంబైలో జీవిస్తున్నందుకు నాకు ఎంతో బాధగా ఉంది" అని తిగ్మన్షు ధూలియా అన్నారు. ఆయన మాటల్లో నిజం ఉంది. కరోనా లేకపోతే ఇర్ఫాన్ అంతిమ యాత్ర అంత నిరాడంబరంగా ఉండేది కాదు. బాలీవుడ్ మహామహులతో, అశేష ప్రేక్షకులతో ముంబై మహానగరంలో రోడ్లు అన్నీ నిడిపోయేవి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



