అప్పుడు `ముకుంద`.. ఇప్పుడు `గని`.. !
on Nov 19, 2021

`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. త్వరలో ఈ టాలెంటెడ్ హీరో.. `గని`తో పలకరించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో.. వరుణ్ బాక్సర్ గా దర్శనమివ్వనున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా `ముకుంద` 2014లో సరిగ్గా ఇదే డిసెంబర్ 24న జనం ముందు నిలిచింది. చెప్పుకోదగ్గ అంచనాల నడుమ విడుదలైన సదరు చిత్రం.. ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత మళ్ళీ అదే డిసెంబర్ 24న రాబోతున్న `గని`తో వరుణ్ తేజ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
కాగా, `గని`లో వరుణ్ తేజ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. జగపతి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



