చైతూ బర్త్ డేకి `బంగార్రాజు` లుక్!
on Nov 19, 2021

`మజిలీ`, `వెంకిమామ`, `లవ్ స్టోరి`.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సామ్రాట్ నాగచైతన్య. కెరీర్ లో ఫస్ట్ టైమ్ హ్యాట్రిక్ చూసిన ఈ యంగ్ హీరో.. త్వరలో `థాంక్ యూ`, `బంగార్రాజు` చిత్రాలతో సందడి చేయనున్నాడు. విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తున్న `థాంక్ యూ`లో సోలో హీరోగా నటిస్తున్న చైతూ.. `బంగార్రాజు`లో తన తండ్రి, కింగ్ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ గ్యాప్ లోనే థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనున్నాయి.
ఇదిలా ఉంటే.. నవంబర్ 23 నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని `బంగార్రాజు` నుంచి తన పాత్ర తాలుకూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. కాగా, `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రూపొందుతున్న `బంగార్రాజు`కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, చైతూకి జంటగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి దర్శనమివ్వనున్నారు. 2022 జనవరిలో ఈ సినిమా జనం ముందుకు వచ్చే అవకాశముందని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



