అప్పుడు `కుమారి 21 ఎఫ్`.. ఇప్పుడు `అనుభవించు రాజా`..!
on Nov 23, 2021
.webp)
`ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావ`, `కుమారి 21 ఎఫ్`.. ఇలా తన తొలి మూడు చిత్రాలతో వరుస విజయాలు అందుకుని హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు రాజ్ తరుణ్. అయితే, ఆ తరువాత వచ్చిన రాజ్ తరుణ్ సినిమాల్లో `ఈడో రకం ఆడో రకం` మినహా మరే చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అరడజనుకి పైగా పరాజయాలతో రేసులో వెనుకబడ్డ ఈ టాలెంటెడ్ యంగ్ హీరో.. త్వరలో `అనుభవించు రాజా` అంటూ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. `సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు` ఫేమ్ శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాని సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ సినిమా.. ఈ నెల 26న విడుదల కాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రాజ్ తరుణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన `కుమారి 21 ఎఫ్` (2015) ఆరేళ్ళ క్రితం సరిగ్గా ఇదే నవంబర్ నెల ద్వితీయార్ధంలో విడుదలై మంచి విజయం సాధించింది. కట్ చేస్తే.. `కుమారి 21 ఎఫ్` తరువాత మళ్ళీ నవంబర్ నెలలో వస్తున్న రాజ్ తరుణ్ చిత్రం `అనుభవించు రాజా`నే కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. సెంటిమెంట్ ప్లస్ అయి `అనుభవించు రాజా`తో రాజ్ తరుణ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



