డిసెంబర్‌లో తమన్ డబుల్ ధమాకా!
on Nov 23, 2021

ప్రస్తుతం తెలుగునాట యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ హవా నడుస్తోంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న తమన్.. ఈ సంవత్సరం ఇప్పటివరకు అరడజను సినిమాలతో సందడి చేశారు. అయితే, వాటిలో సంక్రాంతికి విడుదలైన `క్రాక్`.. ఉగాదికి రిలీజైన `వకీల్ సాబ్` చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. కాగా, ఈ ఏడాది చివరలో అంటే డిసెంబర్ నెలలో రెండు ఆసక్తికరమైన సినిమాలతో పలకరించనున్నారు తమన్.
ఆ చిత్రాలే.. `అఖండ`, `గని`. నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ డ్రామా `అఖండ` డిసెంబర్ 2న విడుదల కానుండగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా `గని` క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ కాబోతోంది. మరి.. మూడు వారాల వ్యవధిలో తమన్ ఇస్తున్న ఈ డిసెంబర్ డబుల్ ధమాకా.. అతని కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



