ENGLISH | TELUGU  

ప్రభాస్ సినిమా నుంచి నేనే వాకౌట్ చేశాను!

on Nov 23, 2021

'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'అఖండ'. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతామని బాలయ్య, బోయపాటి ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. 'అఖండ' సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా తమన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురు కాగా.. ఆయన సినిమా నుంచి తానే తప్పుకున్నాను అంటూ తమన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

'ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేశారు. కొందరు హీరోలతో రెండు మూడు సినిమాలు పైనే చేశారు. మరి ప్రభాస్ తో ఎప్పుడు చేస్తారు?' అన్న ప్రశ్నకు 'చూద్దాం.. త్వరలోనే ఆయనతో కలిసి వర్క్ చేస్తానని అనుకుంటున్నా' అని తమన్ సమాధానం ఇచ్చారు. అదే సమయంలో గతంలో ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'రెబెల్' సినిమా ప్రస్తావన వచ్చింది. 'రెబెల్ టైంలో మీరు డిలే చేశారని న్యూస్ వచ్చింది' అన్న ప్రశ్నకు.. 'నా వల్ల డిలే కాలేదు. నేనే ఆ సినిమా నుంచి వాకౌట్ చేశాను' అంటూ తమన్ సంచలన విషయాన్ని పంచుకున్నారు. 'ఏదో ఐడియా వచ్చింది అంటూ లారెన్స్ గారు మ్యూజిక్ చేస్తాను అన్నారు. అందుకే నేను ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను. లేదంటే ఆ ఛాన్స్ నేను ఎందుకు వదులుకుంటాను' అని తమన్ చెప్పుకొచ్చారు.

ఇక 'అఖండ' సినిమా గురించి మాట్లాడుతూ.. "సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. 'నెవెర్ బిఫోర్ నెవెర్ అగైన్' అనే మాట ఈ మూవీకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. బోర్ కొట్టే సీన్స్ అసలు ఉండవు. అఘోరా ఎంట్రీ తర్వాత మూవీ వేరే లెవెల్ లో ఉంటుంది." అంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు తమన్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.