18 ఏళ్ళ తర్వాత మహేష్ తో సూపర్ స్టార్, వారెవ్వా!
on Aug 12, 2017
దాదాపు 300 చిత్రాల్లో పని చేసిన సూపర్ స్టార్ కృష్ణ శ్రీ శ్రీ సినిమా తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించారు. ఆరోగ్యం సహకరించకపోవడం కూడా కృష్ణ సినిమాలకి గుడ్ బై చెప్పడానికి ఒక కారణం అయితే, కొడుకు మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర హీరో గా ఎదగడం మరో కారణం. కృష్ణ, మహేష్ బాబు తో కలిసి రాజా కుమారుడు, వంశీ మరియు టక్కరి దొంగ లాంటి సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ఎందుకో మళ్ళీ ఇద్దరు కలిసి చేయలేదు. ఘట్టమనేని అభిమానులకి గుడ్ న్యూస్ ఏంటంటే తండ్రి, కొడుకులిద్దరూ మళ్ళీ తెరపై కనిపించనున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న భరత్ అనే నేను సినిమాలో కృష్ణ ని ఒక ప్రత్యేక పాత్ర కోసం అడిగారట డైరెక్టర్ కొరటాల శివ. ఆ పాత్ర నిడివి కొద్దీ సేపే అయినా, ప్రాధాన్యం ఎక్కువుంటుందట. కృష్ణ కూడా ఆల్మోస్ట్ ఓకే చేసారని సమాచారం. ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం ఆ తరం, మరియు ఈ తరం అభిమానులకి వీనుల విందే. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భరత్ అనే నేను లో మహేష్ బాబు అమెరికా నుండి ఇండియా కి వచ్చే అబ్బాయి గా... తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సీఎం గా ఎదిగే వ్యక్తి గా కనిపించనున్నాడు... మహేష్ బాబు సరసన కియారా అద్వానీ కనిపించనుంది. దర్శక, నిర్మాతలు భరత్ అనే నేను ని సంక్రాంతి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.