ఓటీటీ బాటలో ఆర్య మరో చిత్రం
on Jul 3, 2021

కోలీవుడ్ స్టార్ ఆర్య కథానాయకుడిగా నటించిన ప్రీవియస్ మూవీ `టెడ్డీ`.. 2021 మార్చి12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయింది. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమాలో ఆర్య శ్రీమతి, యువ కథానాయిక సాయేషా సైగల్ కూడా నటించింది. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన `టెడ్డీ`కి ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. కట్ చేస్తే.. త్వరలో మరో చిత్రంతో ఓటీటీలో సందడి చేయనున్నాడట ఆర్య.
ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో `కబాలి`, `కాలా` వంటి సినిమాలను రూపొందించిన పా. రంజిత్ దర్శకత్వంలో `సర్పట్ట పరంపరై` పేరుతో ఆర్య ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఉత్తర చెన్నైకి చెందిన బాక్సర్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడమే కాకుండా శరీరాకృతిని కూడా నిజమైన బాక్సర్ ని తలపించేలా మలుచుకున్నారు ఆర్య. ఇదిలా ఉంటే.. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమాని తొలుత థియేటర్స్ లో రిలీజ్ చేయాలని యూనిట్ భావించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో `సర్పట్ట పరంపరై`ని స్ట్రీమ్ చేయబోతున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
మరి.. ఆర్య గత చిత్రం `టెడ్డీ`కి మంచి వీక్షకాదరణ దక్కిన నేపథ్యంలో.. `సర్పట్ట పరంపరై` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



