`ఎన్టీఆర్ 30`కి ముహూర్తం ఫిక్స్
on Jul 3, 2021

`జనతా గ్యారేజ్` (2016) వంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటించనుందని, కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ఆగస్టు నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`ని పూర్తిచేసే పనిలో తారక్.. `ఆచార్య`ని పూర్తిచేసే పనిలో కొరటాల శివ ఉన్నారు. ఈ నెలాఖరుకల్లా ఆయా చిత్రాల తాలూకు చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. మరి.. ఐదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు జట్టుకడుతున్న తారక్ - కొరటాల.. సెకండ్ జాయింట్ వెంచర్ తోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
కాగా, 2022 ఏప్రిల్ 29న `ఎన్టీఆర్ 30`ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



