వరుస చిత్రాలతో తమన్నా!!
on Jan 2, 2019
హీరోయిన్ గా తమన్నా కెరీర్ ప్రారంభించి పుష్కరకాలం దాటినా . యువ కథానాయికలతో పోటీపడుతూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ఉత్తరాదిభామ. ఒక్క తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ రాణిస్తోంది.ఇదిలా ఉంటే వరుసగా మూడు నెలలు పాటు తమన్నా కొత్త చిత్రాలు రిలీజ్ అవుతుండడం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ నెలలో `నెక్స్ట్ ఏంటి?` చిత్రంతో కథానాయికగానూ భారీ బడ్జెట్ కన్నడ చిత్రం `కేజీఎఫ్` లో స్పెషల్ సాంగ్ లోనూ కనిపించిన ఈ మిల్కీ బ్యూటీ. వచ్చే నెలలో సంక్రాంతికి విడుదల కానున్న `ఎఫ్ 2`లో సీనియర్ హీరో వెంకటేష్ కి జోడీ గా దర్శనమివ్వనుంది. ఇక ఫిబ్రవరిలో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ `దటీజ్ మహాలక్ష్మి` రిలీజ్ కానుందని సమాచారం. అంతేకాదు అదే నెలలో తమిళ చిత్రం `కణ్ణే కలైమానే`తోను పలకరించనుంది. మొత్తం మీద డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఇలా మూడు వరుస నెలల్లో తమన్నా నటించిన సినిమాలు విడుదల కావడం విశేషం. ఈ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `సైరా ణరషింహ రెడ్డి`లోనూ హిందీ చిత్రం `ఖామోషి`లోనూ తమన్నా నటిస్తోంది.
ఇదిలా ఉంటే తమన్నా ఎఫ్ 2 చిత్రం కోసం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోందట. ఇప్పటికే తమన్నా `ఊపిరి`, నా నువ్వే`, నెక్ట్స్ నువ్వే చిత్రాలకు గొంతు సవరించిన తమన్నా మరోసారి ఎఫ్ 2 సినిమా కోసం గొంతు విప్పుతోంది. ఈ సినిమా కోసం మెహరీన్ కూడా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుందట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.