RRR రెండు పార్ట్‌లుగా రానుందా??
on Jan 2, 2019
ఏస్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `బాహుబలి` చిత్రం రెండు పార్ట్ లుగా తీయాలని ముందు అనుకులోదన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రషెస్ చూసి ఆ తర్వాత రెండు భాగాలుగా చేస్తే బావుంటుందని అనుకుని రాజమౌళి ఆ తర్వాత రెండు పార్ట్ లుగా తీసుకొచ్చారు. లేటెస్ట్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న `ఆర్ ఆర్ ఆర్` సినిమా కూడా రెండు పార్ట్ లు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఇటీవల ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 1930 బ్యాక్ డ్రాప తో పాటు, 2018 బ్యాక్ డ్రాప్ లలో ఉంటుందట, ఈ క్రమంలో 1930 ఒక భాగంగా, 2018 ఒక భాగంగా తీసుకరావాలన్న ఆలోచనతో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు పరంగా రెండు పార్ట్ లకు స్కోపు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సింది. ఒక వేళ నిజంగా రెండు పార్ట్ లుగా వస్తే మాత్రం ఈ సినిమా ఒక సంచలనం అవుతందనడంలో సందేహం లేదు.