బాలకృష్ణకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్?
on Jan 30, 2020
నటసింహం నందమూరి బాలకృష్ణ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నారా? ప్రతి సినిమాకు కొత్త విగ్గులు ట్రై చేయడానికి బదులు శాశ్వత పరిష్కారం వైపు మొగ్గు చూపించారా? ఇండస్ట్రీ వర్గాల నుండి అవునని మాట వినిపిస్తోంది. దుబాయ్ లో బాలకృష్ణ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారని టాక్. ఇటీవల బాలకృష్ణ కొత్త లుక్ బయటకొచ్చింది. గుండుతో కనిపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో దిగిన సెల్ఫీలు, బోయపాటిని పరామర్శించడానికి వెళ్లిన ఫొటోలను నిశితంగా గమనిస్తే... కాస్త జుట్టుతో కనిపించారు. అదంతా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మహిమే అట.
బాలకృష్ణ లాస్ట్ సినిమా 'రూలర్'లో ఆయన విగ్గులపై, ముఖ్యంగా పోలీస్ గెటప్ విగ్గు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలామంది కామెంట్ చేశారు. అవన్నీ బాలకృష్ణ దృష్టికి వెళ్లడంతో హెయిర్ మీద సీరియస్ గా కాన్సంట్రేట్ చేసి... ట్రాన్స్‌ప్లాంట్ చేయించారట. బోయపాటి సినిమాలో ఆయన కొత్త గెటప్ తో కనిపించనున్నారు. ఫిబ్రవరి 15 నుండి ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఇందులో హీరోయిన్ గా కేథరిన్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిందని అనుకున్నారు. కానీ, వేరే హీరోయిన్ కోసం యూనిట్ చూస్తోంది.