పొగడలేదని అలిగింది
on May 25, 2015
ఈ మధ్య సినిమా జనాలంతా రివ్యూలపై పడ్డారు. 'అసలు రివ్యూలెందుకు రాస్తారు?' అని ప్రశ్నించేవాళ్లు ఒకరైతే - రివ్యూలపైనే రివ్యూలిచ్చేవాళ్లు ఇంకొకరు. ఇప్పుడు తాప్సి కూడా రివ్యూలపై పడింది. ''రివ్యూ రాసేవాళ్లకు హీరోయిన్లంటే చిన్న చూపా?'' అని ప్రశ్నిస్తోంది. అసలు తాప్సి అలకకు కారణమేంటంటే... ఇటీవల తాప్సి నటించిన 'గంగ' సినిమా విడుదలైంది. అందులో తాప్సి బాగానే నటించినా తెలుగు మీడియా మాత్రం గుర్తించలేదట. ఏ రివ్యూలోనూ తనని పొగడలేదట. 'తాప్సి గుడ్' అంటూ ఒక్కముక్కలో తేల్చేశాట. దాంతో తాప్సి అలిగింది. `బాలీవుడ్‌లో బేబీ అనే ఓ సినిమా చేశా. అందులో నాది చిన్న పాత్రే. కానీ అక్కడ రివ్యూల్లో నన్ను కూడా ప్రస్తావిస్తూ రాశారు. `గంగ`లో చాలా కీలకమైన పాత్ర నాది. బాగా నటించా. కానీ.. తెలుగు మీడియా మాత్రం గుర్తించలేదు. రివ్యూల్లో దర్శకుడు గురించి, హీరో గురించి, సంగీతం గురించి రాస్తారు. కానీ మమ్మల్ని పట్టించుకోరు..`` అనేసింది. ఈసారి తాప్సిని ఆహా.. ఓహో అంటూ పొగుడుతూ రాస్తే పోలా.. ఈ గొడవెందుకు?