అమితాబ్‌కు పక్షవాతం
on May 25, 2015
ఎంతైనా బిగ్ బి.. అసలు సిసలైన సూపర్ స్టార్. ఇంత వయసొచ్చినా... ఆయన నటనలో వాడీ వేడీ తగ్గలేదు. తాజా సంచలనం పీకూ లో మలబద్దక రోగిగా కనిపించి ప్రశంసలు అందుకొన్నారు. ఈసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఆయనకే.. అంటూ బిగ్ బీ అభిమానులు గంటాపథంగా చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి మరో సాహసవంతమైన పాత్ర పోషించడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు బిగ్‌బీ. అమితాబ్ తాజా చిత్రం వజీర్. ఇందులో ఆయన పక్షవాత రోగిలా కనిపిస్తారట. మరోసారి అభిమానుల మనసు గెలుచుకొనే పాత్ర ఇదని అమితాబ్ చెబుతున్నారు. వయసు తగ్గ పాత్రల్ని ఎంచుకోవడంలోనే నటుడి ప్రతిభ దాక్కుని ఉంటుంది. అరవై దాటిన మనవాళ్లు మాత్రం ఇంకా 'హీరోలమే' అనుకొంటారు. బిగ్‌బిని చూసి మన హీరోలు చాలా నేర్చుకోవాలి.