తమన్నా... రంగు తగ్గాలమ్మా!
on Dec 12, 2018

తమన్నా పాలరాతి శిల్పంలా వుంటుంది. ఆమెను అభిమానులు ముద్దుగా మిల్క్ బ్యూటీ అనడానికి కారణం అదే. విశాల్ 'ఒక్కడొచ్చాడు' సినిమాలో 'నే కొంచెం నలుపులే... నువ్వు ఏమో తెలుపులే' అని తమన్నా రంగు మీద ఓ పాట వుంటుంది. అంత తెల్లగా వుండే తమన్నాను కొంతమంది దర్శకులు 'రంగు తగ్గాలమ్మా' అంటున్నారు. దీనికి కారణం రాజమౌళి. ఆయన 'బాహుబలి' సినిమాలో మిల్క్ బ్యూటీని డస్కీ స్కిన్ టోనులో చూపించారు. తరవాత ఎఎల్ విజయ్ 'అభినేత్రి'లో పల్లెటూరి అమ్మాయిగా కొంచెం డిఫరెంట్ స్కిన్ టోనులో కనిపిస్తుంది. అప్పట్నుంచి దర్శకులు ఆమెను డస్కీ స్కిన్ టోనులో చూపించడానికి ముందుకొస్తున్నారట. అందుకని, ఎప్పుడూ సెట్‌లో రెండు మేకప్ కిట్స్ పెట్టుకుంటున్నారట. "దర్శకులు ఫెయిర్ స్కిన్ టోన్ కాకుండా డస్కీ స్కిన్ టోన్స్ చూపించాలని అనుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. డస్కీ స్కిన్ టోన్ కోసం పది షేడ్స్ టాన్ మేకప్ వేసుకుంటున్నా" అని తమన్నా పేర్కొంది. 'అభినేత్రి' సీక్వెల్ కోసం... చిరంజీవి సరసన నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' కోసం... తమన్నా సుమారు 50 లుక్ టెస్టులు చేశారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



