నందమూరి హీరోలు వెనక్కి...అఖిల్ ముందుకి!?
on Dec 13, 2018

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'మిస్టర్ మజ్ను'ను 2019 జనవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందువల్ల, అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న నందమూరి కల్యాణ్ రామ్ సినిమా '118' వెనక్కి వెళ్లే అవకాశాలు వున్నాయని ఫిలింనగర్ టాక్. అసలు మ్యాటర్ ఏంటంటే.. అఖిల్ సినిమా విడుదల తేదీ కంటే ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'యన్.టి.ఆర్ మహానాయకుడు' విడుదల తేదీ గురించి కల్యాణ్ రామ్ '118' యూనిట్ ఎక్కువ ఆలోచిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను జనవరి 24న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ మనసు మారినట్టు తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడితో పాటు ఫస్ట్ పార్ట్ విడుదలైన రెండు వారాలకు సెకండ్ పార్ట్ వస్తే వసూళ్లుపై ప్రభావం పడుతుందేమోనని అలోచించి... 'యన్.టి.ఆర్ మహానాయకుడు'ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.
బాబాయ్ బాలకృష్ణ సినిమా ఫిబ్రవరిలో వస్తే... అబ్బాయ్ కల్యాణ్ రామ్ సినిమా జనవరి 25న వస్తుంది. బాబాయ్‌తో పోటీకి అబ్బాయ్ ఏమాత్రం సుముఖంగా లేడని ఫిలింనగర్ టాక్. బాబాయ్ సినిమా విడుదల తేదీని బట్టి తన సినిమాను విడుదల చేయాలని కల్యాణ్ రామ్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకోవడం దాదాపు ఖాయమే. సో... '118' జనవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. కల్యాణ్ రామ్ హిట్ సినిమాల్లో ఒకటైన 'పటాస్' జనవరి నెలాఖరున విడుదలైంది. ఆ సెంటిమెంట్ దృష్ట్యా సినిమాను అసలు వాయిదా వేయాలని అనుకోవడం లేదు. నందమూరి హీరోలు వెనక్కి వెళ్లి... అఖిల్ అక్కినేని ముందుకు వస్తున్నట్టు వార్తల్లో నిజం లేదు. జనవరి నెలాఖరున '118', 'మిస్టర్ మజ్ను' వసూళ్ల వేటలో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



