ENGLISH | TELUGU  

హ్యాపీ బ‌ర్త్ డే టు   సూప‌ర్ స్టార్!!

on Dec 12, 2018

 

ర‌జ‌నీకాంత్ అంటేనే న‌డ‌క‌లో వేగం, న‌వ్వులో వైవిధ్యం. అందుకే నీ న‌డ‌క‌ల స్టైల్ అదిరే, నీ న‌వ్వుల కైపు అదిరే, నీ మాట‌ల తీరు అదిరే అంటూ న‌గ్మ ఓ పాట కూడా పాడుకుంది.  అత‌ని స్టైల్ కి, స్మైల్ కి అభిమానులు ఫిదా.  ఆయ‌న సిగ‌రెట్ వెలిగించినా, కోటు వేసినా, సెల్యూట్ చేసినా ప్ర‌తి దానికి ఒక స్టైల్ ఉంటుంది. అంద‌రి హీరోల్లా ఆయ‌న అంత అందంగా ఉండడు,  ట్రెండ్ ఫాలో కాడు. అంద‌రు అత‌న్ని ఫాలో అయ్యేలా చేస్తాడు.  సాదా సీదా గా ఉంటూనే సెల్యూలాయిడ్ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటాడు.  రీల్ లైఫ్‌లో ఆయ‌న మ్యాన‌రిజం, రియ‌ల్ లైఫ్ లో ఆయ‌న హ్యుమ‌నిజం ఆయ‌న్ను  సూప‌ర్ స్టార్  చేశాయి.  దేశ విదేశాల్లో ఎంతో మంది  అభిమానుల అభిమానం ఆయ‌న సొంతం. ఆయ‌న డైలాగ్ లు చెప్పే విధాన‌మే వేరు. నేను ఒక్క‌సారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టే... దేవు శాసిస్తాడు...ఈ అరుణాచలం పాటిస్తాడు, నా దారి ర‌హ‌దారి లాంటి ఎన్నో డైలాగ్స్ సినీ ప్రేక్ష‌కులు చేత విజిల్స్ కొట్టించాయి.  1949 డిసెంబ‌ర్ 12న క‌ర్ణాట‌క‌లో జ‌న్మించిన శివాజీ రావు గైక్వాడ్  బెంగుళూరు లో  కండ‌క్డ‌ర్ గా త‌న జీవితాన్ని ప్రారంభించాడు.  అప్ప‌టి నుంచే స్టేజ్ ల మీద నాట‌కాలు కూడా వేస్తుండేవాడు. ఆ స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ‌స్ట్ టైమ్ 1975లో `అపూర్వ రాగంగ‌ళ్‌` సినిమాలో ప్రతి నాయ‌కుడుగా న‌టించి మెప్పించాడు.  

ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ గా మారి సినీ వీనిలాకాశంలో హీరోగా సంచ‌ల‌నాలు సృష్టించాడు.  తెలుగులో వ‌చ్చిన `చిల‌క‌మ్మ చెప్పింది` సినిమాలో మొద‌టిసారి ర‌జ‌నీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ర‌జ‌నీలో న‌టుణ్ని  ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది ...కే .బాల‌చంద‌ర్‌.  ఆయ‌న మొద‌ట చేసిన పాత్ర‌లో నెగిటివ్‌గా , సెకండ్ హీరోగా చేసారు. ఆయ‌న్ను సోలో హీరోగా  చేసింది మాత్రం ఎస్వీ ముత్తురామ‌న్‌.  1977 లొ తెలుగులో సింగిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ త‌ర్వాత సోలో హీరోగా అంత‌గా అవ‌కాశాలు రాలేదు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీల్లో మంచి రోల్స్  వ‌చ్చాయి. సెకండ్ హీరోగా చాలా సినిమాలు చేశాడు.  1980లో త‌న 25వ సినిమా చేసిన `భైర‌వి` త‌మిళ్ లో ఫుల్ లెంగ్త్ హీరో రోల్ లో హీరోగా న‌టించాడు. ఆ త‌ర్వాత వ‌రుస స‌క్సెస్ ల‌తో సౌత్ ఇండియాలో సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు ర‌జ‌నీ కాంత్. ఆడియ‌న్స్ లో  ర‌జ‌నికాంత్ కు అంత క్రేజ్ రావ‌డానికి కార‌ణం ఆయ‌న స్టైల్ , స్మైల్.  ఇక ఆయ‌నలోని పూర్తిస్థాయి స్టైల్ని, మేన‌రిజాన్ని ఆవిష్క‌రించిన చిత్రం `బాషా` ఈ సినిమాలో నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పిన‌ట్టే డైలాగ్ ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేదు.  ఈ సినిమాతో తెలుగులో హీరోల‌తో స‌మానంగా మార్కెట్ , అభిమాన‌ల‌ను సంపాదించుకున్నాడు. 

ర‌జ‌నీకాంత్...ఈ పేరుని వ‌ర‌ల్డ్ వైడ్ గా ప‌రిచ‌యం చేసింది మాత్రం `ద‌ళ‌ప‌తి ` చిత్రం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టితో క‌లిసి ప‌ని చేశారు. త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ , తెలుగుల్లో అనేక‌మంది క‌థానాయ‌కుల‌తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించి మెప్పించారు.  తెలుగులో డైర‌క్ట్ గా న‌టించిన సినిమా `పెద‌రాయుడు`.  ఈ సినిమాలో కనిపించేది కాసేపే అయినా...ఆ రోల్ గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే అవుతుంది. ఈ సినిమా విజ‌యంలో ర‌జ‌నీ పాత్ర ప్ర‌ధాన కార‌ణం అయింది.  ఆ త‌ర్వాత వచ్చిన `ముత్తు` సినిమా కూడా ర‌జ‌నీకి పెద్ద హిట్. సూప‌ర్ స్టార్ ఖ్యాతిని జ‌పాన్  వ‌ర‌కు తీసుకెళ్లిన సినిమా `ముత్తు`.  ఈ సినిమా హిట్ తో విదేశాల్లో ర‌జ‌నీ పేరు ఖండంత‌రాలు దాటింది.  ఆ త‌ర్వాత `అరుణాచ‌లం`, న‌ర‌సింహా, చంద్ర‌ముఖి, శివాజీ, మూవీలు ర‌జనీకాంత్ కు ఇమేజ్ ను పెంచాయి.  శంక‌ర్ , ర‌జ‌నీ కాంబినేష‌న్ లో వ‌చ్చిన రెండో అద్భుత సైంటిఫిక్ మూవీ `రోబో` కోలీవుడ్‌, బాలీవుడ్ ల‌తో పాటు టాలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. 

రోబో త‌ర్వాత ర‌జ‌నీకాంత్ న‌టించిన `కొచ్చ‌డ‌యాన్` లింగ‌, క‌బాలి, కాలా, సినిమాలు అంత గా ఆడ‌క‌పోయినా...  ఆ వ‌య‌సులో కూడా ఆయ‌న స్టైల్ కి, ఎనర్జీకి ఫిదా అయ్యారు.  రీసెంట్ గా విడుద‌లైన `2.0` మూవీతో మ‌రోసారి చిట్టి రోబోగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.  ప్ర‌జంట్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `పేటా` మూవీలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఎన్నో సినిమాల‌కు ఉత్త‌మ న‌టుడుగా అవార్డులు,   ఎన్నో ఫిలిం ఫేర్ అవార్డులు,  కేంద్రం నుంచి పద్మ‌భూష‌ణ్‌, పద్మ విభూష‌న్ అవార్డులు అందుకున్నారు.  ర‌జ‌నీకాంత్ కి ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌. త్వ‌ర‌లో పాలిటిక్స్ లోకి  పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు, రియ‌ల్ లైఫ్ లో కూడా అస‌లైన హీరోగా అనింపించుకున్న  ర‌జ‌నీకాంత్ కు తెలుగువ‌న్  పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.