మళ్లీ గీతా ఆర్ట్స్ లో నే ఆ దర్శకుడి చిత్రం!!
on Dec 11, 2018

గీతా ఆర్ట్స్ లో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన `గీత గోవిందం` చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడదులై నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆ దర్శకుడి తదుపరి చిత్రం ఏంటనేది ప్రకటించలేదు పరశురామ్. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం... పరశురామ్ కి రెండు పెద్ద బేనర్స్ లో సినిమాలు ఓకే అయినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ కాగా మరొకటి గీతా ఆర్ట్స్ . అయితే ఈ రెండు బేనర్స్ లో మొదట మళ్లీ గీతా ఆర్ట్స్ లో నే పరశురామ్ తన తదుపరి సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్న పరశురామ్ త్వరలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డీటైల్స్ గురించి ప్రకటించనున్నారు. అయితే స్టైలిష్ స్టార్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే గీతా ఆర్ట్స్ లో చేయబోయే సినిమా బన్నీతో నే అయి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. చూద్దా ఎలా ఉంటుందో!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



