వెంటాడుతున్న కేసు.. మార్కాపురం కోర్టుకి హీరో సుమంత్, సుప్రియ!
on Dec 17, 2021

'నరుడా డోనరుడా' సినిమాకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ ఈ సినిమా ఫైనాన్సియర్ కారుమంచి శ్రీనివాసరావు గతంలో కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సుమంత్, సుప్రియ కోర్టుకు హాజరయ్యారు.
Also Read: సూపర్ స్టార్ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగా!!
2012లో వచ్చిన హిందీ చిత్రం ‘విక్కీ డోనర్’కు తెలుగు రీమేక్ గా 'నరుడా డోనరుడా' తెరకెక్కింది. 2016 నవంబర్ లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో సుమంత్ హీరోగా నటించగా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై జాన్ సుధీర్ పుధోతతో కలిసి సుప్రియ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాకి ఫైనాన్సియర్‌గా వ్యవహరించిన శ్రీనివాసరావు.. 70 లక్షలకు సుప్రియ, సమంత చెక్ లు ఇవ్వగా, అవి బౌన్స్ అయ్యాయని.. ఈ వ్యవహారంలో తనను మోసం చేశారని మార్కాపురం కోర్టులో కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం సుమంత్, సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.
Also Read: నిన్నటి వరకు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్పడు పెళ్లాం?
అయితే ఈ కేసు విషయంలో గతంలో కూడా సుమంత్, సుప్రియ కోర్టుకి హాజరయ్యారు. మూడు నాలుగేళ్లుగా వాయిదాల మీద నడుస్తున్న ఈ కేసుకు కరోనా వల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఈ గురువారం నాడు మరోసారి ఈ కేసు వాయిదాకు రావడంతో సుమంత్, సుప్రియ కోర్టుకు హాజరయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



