రాజశేఖర్ పై ఇలాంటి వ్యాఖ్యలా సుకుమార్..అభిమానులు వింటే గుడి కడతారు
on Jan 11, 2025
అల్లుఅర్జున్(Allu Arjun)హీరోగా తెరకెక్కిన 'ఆర్య' మూవీ ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యాడు దర్శకుడు సుకుమార్(Sukumar).ఎవ్వరు టచ్ చెయ్యని ఒక కొత్త రకమైన లవ్ జోనర్ ని ఆ మూవీ ద్వారా తెరకెక్కించి మొదటి సినిమాతోనే క్రియేటివ్ దర్శకుడుగా తన సత్తా చాటాడు.ఆ తర్వాత 100 %లవ్, జగడం,ఆర్య 2 ,1 నేనొక్కడినే,నాన్నకు ప్రేమతో,రంగస్థలం,పుష్ప పార్ట్ 1 ,పార్ట్ 2 తో అగ్ర దర్శకుడుగా మారాడు.
గతంలో సుకుమార్ మాట్లాడుతు నాకు హీరో రాజశేఖర్(Rajashekar)గారంటే పిచ్చి అభిమానం.ఒక రకంగా చెప్పాలంటే వీరాభిమానిని కూడా.అంకుశం,ఆహుతి,ఆగ్రహం,మగాడు,తలంబ్రాలు వంటి చిత్రాలు నన్నెంతగానో ప్రభావితం చేసాయి. చిన్నతనంలో ఆయన్ని ఇమిటేట్ కూడా చేసేవాడ్ని.దాంతో అందరు ఒన్స్ మోర్ అంటు విజిల్స్ వేసేవాళ్ళు.ఆ విధంగానే నేను ఫేమస్ అయ్యాను.సినిమాల్లోకి వెళ్లి ఏదైనా సాధించగలననే నమ్మకం కూడా రాజశేఖర్ గారి వల్లే కలిగిందని చెప్పుకొచ్చాడు.ఈ రోజు సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని మరో సారి చెప్పడం జరిగింది
సుకుమార్ లేటెస్ట్ గా పుష్ప 2(Pushpa 2)తో ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించాడు.ఇప్పటీకే బాహుబలి 2 రికార్డులని కూడా పుష్ప 2 దాటింది.ఇక సుకుమార్ తన నెక్స్ట్ మూవీ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో చెయ్యబోతున్నాడు.దీంతో ఆ మూవీ పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోలోరంగస్థలం వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
Also Read