గేమ్ చేంజర్ రిజల్ట్ పై కథని అందించిన కార్తీక్ సుబ్బరాజ్ సంచలన ట్వీట్
on Jan 11, 2025
.webp)
సంక్రాంతి కానుకగా జనవరి 10 న థియేటర్స్ లోకి వచ్చిన రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో మూవీ గేమ్ చేంజర్(Game Changer)శంకర్(Shankar)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు(Dil Raju)సుమారు 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు.డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ ప్రదర్శించిన నటనకి ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు.ఇక తొలి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా చిత్ర బృందం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తు అధికారంగా ప్రకటించింది.
ఇక గేమ్ చేంజర్ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)అందించిన కథతో తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా గేమ్ చేంజర్ పై స్పందిస్తు గేమ్ ఛేంజర్ వింటేజ్ శంకర్ గారి పొలిటికల్ పంచెస్ తో గ్రాండ్ గా మాస్ యాక్షన్ వైబ్స్ తో సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది.
రామ్ చరణ్,ఎస్ జె సూర్యల పెర్ఫామెన్స్ అదిరిపోయింది. తిరు సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్ లెంట్. ఇతర టీంకి కూడా శుభాకాంక్షలు.సినిమాలో నాకు కూడా చిన్న భాగం ఇచ్చినందుకు శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ 'ఎక్స్' వేదికగా తెలియచేసాడు.ఇప్పడు ఈ ట్వీట్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. శంకర్ కూడా ధన్యవాదాలు అంటు రిప్లై ఇవ్వడం జరిగింది.
కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం సూర్య తో మూవీ చేస్తున్నాడు.ఇక గేమ్ చేంజర్ లో చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించగా,కియారా అద్వానీ,అంజలి హీరోయిన్లుగా చేసారు.ఎస్ జె సూర్య,శ్రీకాంత్, సముద్ర ఖని,సునీల్,రాజీవ్ కనకాల,జయరాం కీలక పాత్రలు పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



