'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్ పై దారుణంగా ట్రోల్స్..!
on Jan 11, 2025
పెద్ద సినిమాల విషయంలో మేకర్స్ వాస్తవంగా వచ్చిన కలెక్షన్స్ ని కాస్త పెంచి ప్రమోట్ చేసుకోవడం చూస్తుంటాం. సాధారణంగా వచ్చిన కలెక్షన్స్ కంటే అదనంగా రూ.10-15 కోట్లు జత చేసి పోస్టర్లు విడుదల చేస్తుంటారు మేకర్స్. అయితే ఇది 'గేమ్ ఛేంజర్' విషయంలో మరీ దారుణంగా ఉందని, ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ని ఏకంగా డబుల్ చేసి పోస్టర్లు రిలీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. (Game Changer)
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ కి అటు ఇటుగా రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ మూవీ టీం రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్స్ లో ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ప్రకటించారు. దీంతో యాంటీ ఫ్యాన్స్ 'గేమ్ ఛేంజర్' టీంని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరీ ఇంతలా ఫేక్ చేసి, టాలీవుడ్ పరువు తీస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కేవలం 'దేవర' డే-1 కలెక్షన్ ని క్రాస్ చేశామని చెప్పుకోవడం కోసమే, ఇలా ఫేక్ పోస్టర్ రిలీజ్ చేశారని ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విమర్శలను రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా తిప్పి కొడుతున్నారు. మీ హీరోల సినిమా పోస్టర్లు ఫేక్ కానప్పుడు, మా హీరో సినిమా పోస్టర్ ఎలా ఫేక్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
Also Read