ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్
on Mar 3, 2022
యుద్ధాన్ని ఆపడానికి క్యివ్‌తో తదుపరి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఓ వైపు చెప్తూనే, మరోవైపు రష్యా 7వ రోజు ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగించింది. రష్యా దాడి వల్ల వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఈ మధ్యలో ఆపద్బాంధవుడిగా దేశవ్యాప్తంగా పేరు పొందిన సోనూ సూద్ వారికి రక్షకుడిగా మారారు. చాలా మంది విద్యార్థులు సోను స్వచ్ఛంద సంస్థ నుండి సహాయం పొందుతున్న వీడియోలను పంచుకున్నారు. వారు క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోను సైతం అప్‌డేట్స్‌ను పంచుకున్నాడు.
కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుకోవడంలో సహాయపడిన సోనూ సూద్ అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. వారు పోలండ్ బోర్డర్‌కు చేరుకుని సురక్షితంగా తమ ఇళ్లకు తిరిగి రావడానికి తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన తమకు అందిస్తున్న సపోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ కొంతమంది విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలను పంచుకున్నారు.
తన తరలింపు ప్రణాళికను వివరిస్తూ, స్థానిక టాక్సీలు విద్యార్థులు ఉన్న ప్రదేశానికి పంపుతున్నామనీ, అక్కడి నుండి వారిని ఖార్కివ్‌లోని రైల్వే స్టేషన్‌కు తీసుకువెళతారనీ సోనూ సూద్ తెలిపారు. అక్కడి నుంచి విద్యార్థులు రైలులో ఎల్వివ్ నగరంలోని సురక్షిత ప్రదేశానికి వెళతారు. అక్కడి నుంచి వారిని పోలిష్ సరిహద్దుకు తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సోను కూడా ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు.
మార్చి 2న, "ఉక్రెయిన్‌లో మన విద్యార్థులకు కష్ట సమయాలు, ఇప్పటి వరకు నా కష్టతరమైన అసైన్‌మెంట్ ఇదే. అదృష్టవశాత్తూ మేము చాలా మంది విద్యార్థులకు సరిహద్దు దాటి సురక్షిత ప్రాంతానికి చేరుకోవడంలో సహాయం చేయగలిగాం. మనం ప్రయత్నిస్తూనే ఉందాం. వారికి మన అవసరం ఉంది. మీరు అందిస్తున్న తక్షణ సాయానికి ధన్యవాదాలు @eoiromania @IndiaInPoland @meaindia . జై హింద్ (sic)." అని ఆయన ట్వీట్ చేశారు.
Also Read