ఫ్యామిలీ ఫొటో వైరల్.. ఆకట్టుకుంటోన్న అజిత్ గడ్డం లుక్!
on Mar 3, 2022
అజిత్ కుమార్ హీరోగా నటించగా ఇటీవల విడుదలైన 'వలిమై' చిత్రం విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే, తాజాగా తన కుమారుడు ఆద్విక్ పుట్టినరోజును జరుపుకోవడానికి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చాడు అజిత్. ఆద్విక్ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో అజిత్, షాలిని కెమెరాకు పోజులివ్వడాన్ని చూడవచ్చు. అజిత్, షాలిని, కూతురు అనౌష్క, కొడుకు ఆద్విక్‌లతో కూడిన మరో ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
లిటిల్ అద్విక్ అజిత్ కుమార్‌కు మార్చి 2తో ఏడేళ్లు నిండాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవడానికి కుటుంబం కలిసింది. అజిత్‌కి వర్క్ షెడ్యూల్, టూర్స్‌పై ఉన్న ఇష్టం కారణంగా, ఆయన తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి వీలుపడట్లేదు. అయితే మార్చి 2న ఆయన ఆద్విక్ పుట్టినరోజును సందడిగా జరిపాడు.
ఫొటోలను బట్టి అజిత్ తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లినట్లు కనిపిస్తోంది. పొడవాటి గడ్డంతో ఉన్న ఆయన కొత్త లుక్ ఆకర్షణీయంగా ఉంది. AK61 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోయే చిత్రానికి ఆయన సిద్ధమవుతున్నాడు. అజిత్, షాలిని, అనౌష్క, ఆద్విక్ కలిసున్న ఒక ఫ్యామిలీ పిక్చర్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరో సెట్ ఫొటోల్లో అజిత్, షాలిని సెల్ఫీలు తీసుకోవడం చూడొచ్చు. ఈ ఫొటోలను చూసి అజిత్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు.
Also Read