శివ కార్తికేయన్ కి జోడీగా సాయి పల్లవి!
on Feb 2, 2022

`లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` చిత్రాలతో తెలుగునాట చాన్నాళ్ళ తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది డాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవి. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ నటించిన `విరాట పర్వం` జనం ముందుకు రాబోతోంది. ఇందులో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటికి జోడీగా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనుంది సాయి పల్లవి.
ఇదిలా ఉంటే.. తన మాతృభాష తమిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సాయి పల్లవి. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యంగ్ సెన్సేషన్ శివ కార్తికేయన్ తో లోక నాయకుడు కమల్ హాసన్ హోమ్ బేనర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఓ సినిమాని నిర్మిస్తోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ కి జంటగా సాయి పల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. కథ, పాత్ర నచ్చడంతో సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందని టాక్. త్వరలోనే శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీపై క్లారిటీ రానున్నది.
మరి.. తమిళనాట ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేని సాయి పల్లవికి ఈ చిత్రంతోనైనా ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



