అదితి రావ్ హైదరీ ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్!
on Feb 2, 2022

నటిగా అదితి రావ్ హైదరీది 15 ఏళ్ళకు పైగా సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. అయితే, స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తెలుగు, తమిళ భాషల్లో అయితే మీడియం రేంజ్ హీరోలకే పరిమితమవుతూ వస్తోంది అదితి.

ఇదిలా ఉంటే.. తాజాగా అదితి రావ్ హైదరీకి ఓ కోలీవుడ్ స్టార్ కి జంటగా నటించే ఛాన్స్ దక్కిందట. ఆ స్టార్ మరెవరో కాదు.. అజిత్ కుమార్. ఆ వివరాల్లోకి వెళితే.. `ఖాకీ` ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. `నేర్కొండ పార్వై`, `వలిమై` చిత్రాల అనంతరం అజిత్, వినోద్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో కింగ్ నాగార్జున, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులోకి అజిత్ కి జంటగా అదితి రావ్ హైదరీ ఎంపికైందట. అంతేకాదు.. పాన్ - ఇండియా మూవీగా ఈ సినిమా జనం ముందుకు రానుందని అంటున్నారు. త్వరలోనే అజిత్, అదితి జోడీపై క్లారిటీ రానుంది.
Also Read: సెట్లో టీవీ నటుడికి దారుణ అవమానాలు
కాగా, అదితి రావ్ హైదరీ తాజా తమిళ చిత్రం `హే సినామిక`.. ఫిబ్రవరి 25న తెరపైకి రానుంది. దానికంటే ఒక రోజు ముందు అజిత్ నటించిన `వలిమై` విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



