'సింగం 123'ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్
on Apr 8, 2015
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా డా.యం.మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై డైనమిక్ హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు నిర్మిస్తోన్న చిత్రం 'సింగం 123'. ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. విడుదల చేసినప్పటి నుండి టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగానే స్టోరి, స్క్రీన్‌ప్లేను కూడా మంచు విష్ణు అందించడం విశేషం. ఈ చిత్రంలో సంపూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. సంపూ ఎంట్రీ సీన్ నుండి తను చెప్పే ప్రతి డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సింగరాయ కొండ ప్రాంతంలోని తన అండ, ఆర్ధిక బలంతో మాఫియాగా ఎదిగిన లింగంను అరెస్టు చేయడానికి శతవిధాలా ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్‌మెంట్ చివరికి లింగంను అరెస్టు చేయడానికి పవర్‌ఫుల్ ఆఫీసర్ అయిన సంపూను అక్కడ నియమిస్తుంది. మరి సింగం 123 ప్రత్యేక మిషన్‌తో లింగంను ఎలా అరెస్టు చేస్తాడనేదే కథాంశం. ఈ చిత్రాన్ని అక్షత్ అజయ్ శర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.