బాలయ్యని పేరడీ చేసిన సంపూ
on Apr 8, 2015
నీకు బీపీ వస్తే నీ పీకే వణుకుతాడేమో
నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ..
- ఇదీ లెజెండ్‌లో బాలయ్య డైలాగ్.
దీన్ని సంపూ పేరడీ చేశాడు... సింగం 123 కోసం
నీకు బీపీ వస్తే నీ చంచాగాళ్లు భయపడతారేమో
నాకు బీపీ వస్తే... ఏపీ తెలంగాణ రాయలసీమ కేరళ బీహార్ కర్నాటక... దేశం మొత్తం వణుకొద్ది.. అంటూ ఆల్ ఇండియాకి వినిపించేలా గర్జించాడు సంపూ. ఆఖరికి రేసుగుర్రంలో బన్నీ డైలాగ్‌నీ వదల్లేదు. రేసులో ఉన్నవాళ్లని అందుకోవడానికి నేను రేసుగుర్రాన్ని కాదు... రెడ్ బుల్ తాగిన సింహాన్ని.. అంటూ మళ్లీ వీర ప్రతాపం చూపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైటర్ హల్ చల్ చేస్తోంది. వీలుంటే మీరూ ఓ లుక్కేయండి.